![]() |
![]() |

బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలైపోయింది. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. మొదటిగా బెజవాడ నుంచి దివ్య ఎంట్రీ ఇచ్చిది. డాక్టర్ చదువుతోంది. ఒక్కో జడ్జ్ ఒక్కో ప్రశ్న అడిగారు. " ఇక్కడ నలుగురు బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో ఒకరు బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరో చెప్పాలి" అని అభిజిత్ అడిగాడు. వెంటనే దివ్య... "నేను బిగ్ బాస్ సీజన్ 1 లో నవదీప్ అంటే నాకు ఇష్టం. నవ్వించడం ఒక ఆర్ట్. స్పాంటేనియస్ గా నవ్వించడం ఎవరూ చేయలేని పని ఇక వరస్ట్ అంటే అభిజిత్" అని చెప్పింది దివ్య. దానికి అభిజిత్ ఫీల్ కాకుండా అది నీ అభిప్రాయం అని అన్నాడు. తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తున్నాను..అభిజిత్ అంటే ఇష్టం లేదు అన్నావ్ కాబట్టి ఎలా నామినేట్ చేస్తావో చెప్పు అంది శ్రీముఖి. "బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ అభిజిత్ . చూడడానికి బాగుంటారు. టాస్కులు అన్ని ఆడాలి. సోఫాలో కూర్చుని మైండ్ గేమ్స్ ఆడేసి గెలిచేసాను అంటే ఒప్పుకోను నిజానికి ఆయన ఫోకస్ అంతా గేమ్ మీద కంటే మిగతా కంటెస్టెంట్స్ మీదనే ఉందని నాకు అనిపించింది. గేమ్ ని రెస్పెక్ట్ చేయనివాళ్లను నేను నామినేట్ చేస్తా" అని చెప్పి అభిజిత్ ఫోటోని కాల్చేసింది.
"సారీ కానీ థ్యాంక్యూ అని ఏమన్నా చెప్తావా"అని శ్రీముఖి అడిగేసరికి "నామినేషన్స్ లో సారీ కానీ థ్యాంక్యూ కానీ ఏమీ ఉండవు కదా" అంది దివ్య. తర్వాత అభిజిత్ ని దివ్య ముందు నిలబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి "నాకు నీ గేమ్ నచ్చలేదు అని చెప్పు" అంది శ్రీముఖి. "ఒక్క గేమ్ కూడా నాకు నచ్చలేదు. ఒక్క ఫిజికల్ టాస్క్ లో కూడా మీరు గెలిచినట్టు కనిపించలేదు. అలా అని ఫిజికల్ టాస్క్స్ మాత్రమే బిగ్ బాస్ కాదు." అని చెప్పింది. "ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ గెలుస్తారు సెలబ్రిటీస్ గెలుస్తారా" అని శ్రీముఖి అడిగింది. "సెలబ్రిటీ కంటే కామన్ వాళ్లకు బెటర్ ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఓపెనప్ కాలేరు. కానీ కామన్ పీపుల్ కి ఆ భయం ఉండదు." అని చెప్పింది దివ్య. ఇక అభిజిత్ జనాలు మీ మాటను కూడా అంగీకరిస్తారేమో చూద్దాం అని వెళ్లి కూర్చున్నాడు.
![]() |
![]() |